NTV Telugu Site icon

KTR: మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం

Ktr

Ktr

KTR: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం లభించింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపించారు. జూన్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదిక‌గా ‘వరల్డ్ ఏఐ షో – మెనా 41వ గ్లోబల్ ఎడిషన్’ జ‌ర‌గ‌నుంది. మంత్రి కేటీఆర్ సార‌థ్యంలో తెలంగాణ అద్భుతమైన పురోగతిని, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా రావాలని ట్రెస్కాన్ సంస్థ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

Read Also: Kishan Reddy: ప్రజాజీవనాన్ని సౌలభ్యంగా మార్చడమే మోదీ సర్కారు లక్ష్యం

పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్య రంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శించ‌నున్నారు. దుబాయ్‌కు అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఏఐ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించనున్నారు. దీంతో పాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని.. అటువంటి నేతలు పాల్గొంటే సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని ట్రెస్కార్ వ్యవస్థాపకులు ఎండీ మహమ్మద్ సలీం మంత్రికి పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.