Site icon NTV Telugu

Minister KTR : స్విట్జర్లాండ్ లో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం

Minister Ktr

Minister Ktr

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 16 నుంచి జనవరి 20వ తేదీ వరకు జరగనున్న కు రాష్ట్రం నుంచి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారు. అయితే.. గత శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి కేటీఆర్‌ తన బృందంతో బయలు దేరారు. అయితే.. ఆదివారం జ్యూరిచ్ చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు జ్యూరిచ్‌ విమానాశ్రయంలో భారీ ఎత్తున ఎన్నారైలు స్వాగతం పలికారు. జ్యూరిచ్‌ నగరంలోనే కాక, స్విట్జర్‌లాండ్‌లోని ఇతర నగరాలు, యూరోప్‌లోని ఇతర దేశాల నుండి వచ్చిన ఎన్నారైలు విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో స్విట్జర్‌లాండ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ గండె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఇవ్వాళ సాయంత్రం జ్యూరిచ్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన “మీట్ ఎండ్ గ్రీట్” కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. రేపు దావోస్ చేరుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు.

Also Read : Drugs Seized : మాత్రల రూపంలో రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్.. సీజ్ చేసిన అధికారులు

తెలంగాణ నుండి వ్యాపార ప్రతినిధి బృందం ఎకనామిక్ ఫోరమ్‌కు వెళ్లడం ఇది ఐదవసారి. తెలంగాణ 2018లో మొదటిసారిగా డబ్ల్యూఈఎఫ్‌కి ప్రతినిధి బృందాన్ని పంపారు. అయితే.. 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘విచ్ఛిన్నమైన ప్రపంచంలో సహకారం’ అనే థీమ్‌తో జరుగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుండి ఆహ్వానం మేరకు తెలంగాణ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. డబ్ల్యూఈఎఫ్‌లో వివిధ సెషన్స్‌లో పాల్గొనడమే కాకుండా దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో పలు గ్లోబల్ మార్క్యూ కంపెనీల అగ్రనేతలతో మంత్రి సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్‌తో పాటు పరిశ్రమల రౌండ్‌టేబుల్స్‌లో కూడా మంత్రి పాల్గొంటారు.

Also Read : Himaja: ఏడనుంచి వస్తున్నాయి రా అన్ని డబ్బులు.. కార్ల మీద కార్లు కొంటున్నారు

Exit mobile version