NTV Telugu Site icon

KTR: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి.. 4లక్షల ఉద్యోగాలు

Ktr

Ktr

Minister KTR: హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ – 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీలో భాగంగా వారం రోజుల పాటు హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌ను నిర్వహించనున్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకంలో అవగాహన పెంచడానికి హైదరాబాద్ ఈ – మొబిలిటీ వీక్‌ను ఏర్పాచు చేశారు. ఈవీ రంగానికి ఊతమిచ్చేలా నేటి నుంచి ఈ-మొబిలిటీ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు.

ఇండియాలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్‌లో ఈ సమ్మిట్ నిర్వహించడం సంతోషమని మంత్రి కేటీఆర్ అన్నారు. వాతావరణాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం అందరికి అవసరమన్నారు. హైదరాబాద్‌లో ఈ – మొబిలిటీ వీక్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని.. దీనిలో భాగంగానే ర్యాలీని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇండియాలోనే తొలిసారి ఫార్ములా – ఈ రేస్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సోలార్ ఎనర్జీలో దేశంలో తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో ఉందన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి.. ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ కంపెనీస్ పెట్టాలి అనుకునే వారికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నామన్నారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్‌లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు.

Etala Rajender: బడ్జెట్ పై విమర్శలు చేయట్లే కానీ..

ఇండియాలోనే మొదటీ మొబిలిటీ వ్యాలీ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఈవీ మ్యానిఫ్యాక్చర్ క్లష్టర్స్ ఉన్నాయన్నారు. మోమిన్‌పేట్‌ లో తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే మరో 4 మొబిలిటీ క్లష్టర్స్ ఏర్పాటు ప్రకటిస్తామని తెలిపారు. స్టార్టప్స్‌ని, ఇన్నోవేటివ్ ఆలోచనలని సపోర్ట్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే అమర్ రాజా గ్రూప్, హ్యుందాయ్ వంటి చాలా కంపెనీస్ తెలంగాణలో యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో పలు కంపెనీలు ఎంవోయూలను కుదుర్చుకున్నాయి.