Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Ktr Participated In Mobility Next Hyderabad Summit 2023 At Hicc In Hyderabad

KTR: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి.. 4లక్షల ఉద్యోగాలు

Published Date :February 6, 2023 , 3:50 pm
By Mahesh Jakki
KTR: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి.. 4లక్షల ఉద్యోగాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister KTR: హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ – 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీలో భాగంగా వారం రోజుల పాటు హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌ను నిర్వహించనున్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకంలో అవగాహన పెంచడానికి హైదరాబాద్ ఈ – మొబిలిటీ వీక్‌ను ఏర్పాచు చేశారు. ఈవీ రంగానికి ఊతమిచ్చేలా నేటి నుంచి ఈ-మొబిలిటీ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు.

ఇండియాలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్‌లో ఈ సమ్మిట్ నిర్వహించడం సంతోషమని మంత్రి కేటీఆర్ అన్నారు. వాతావరణాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం అందరికి అవసరమన్నారు. హైదరాబాద్‌లో ఈ – మొబిలిటీ వీక్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని.. దీనిలో భాగంగానే ర్యాలీని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇండియాలోనే తొలిసారి ఫార్ములా – ఈ రేస్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సోలార్ ఎనర్జీలో దేశంలో తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో ఉందన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి.. ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ కంపెనీస్ పెట్టాలి అనుకునే వారికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నామన్నారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్‌లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు.

Etala Rajender: బడ్జెట్ పై విమర్శలు చేయట్లే కానీ..

ఇండియాలోనే మొదటీ మొబిలిటీ వ్యాలీ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఈవీ మ్యానిఫ్యాక్చర్ క్లష్టర్స్ ఉన్నాయన్నారు. మోమిన్‌పేట్‌ లో తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే మరో 4 మొబిలిటీ క్లష్టర్స్ ఏర్పాటు ప్రకటిస్తామని తెలిపారు. స్టార్టప్స్‌ని, ఇన్నోవేటివ్ ఆలోచనలని సపోర్ట్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే అమర్ రాజా గ్రూప్, హ్యుందాయ్ వంటి చాలా కంపెనీస్ తెలంగాణలో యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో పలు కంపెనీలు ఎంవోయూలను కుదుర్చుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • e-mobility
  • EV
  • Hyderabad E-Mobility Week
  • hyderabadm
  • ktr

తాజావార్తలు

  • Coconut Water: ఏ కొబ్బరి కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ చిన్న చిట్కాలతో కనిపెట్టవచ్చు..

  • Mudit Jain: ఇది కదా డెడికేషన్.. కోచింగ్ లేకుండానే సీబీఎస్ఈలో 500కి 500 మార్కులు..

  • TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • KTR : తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరాన నిండి ఉంది

ట్రెండింగ్‌

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions