Site icon NTV Telugu

Minister KTR : తెలుగులోనూ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలి

Ktr

Ktr

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగులోనూ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కే . తారక రామారావు కోరారు. తాజాగా సీఆర్పీఎఫ్‌ ఉద్యోగాలకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ లో హిందీ మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలోనే పరీక్ష అని పేర్కొనడం పట్ల కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల కోట్లాది మంది హిందీయేతర ప్రాంత నివాసిత నిరుద్యోగ యువకులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.

Also Read : UAE astronaut: అంతరిక్షంలో నడిచిన తొలి అరబ్‌.. చరిత్ర సృష్టించనున్న యూఏఈ వ్యోమగామి

రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ ఈ పరీక్ష నిర్వహించాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్ సవరించాలని లేఖ రాశారు కేటీఆర్. ఇంగ్లీష్ మీడియం చ‌ద‌వ‌ని అభ్య‌ర్థుల‌తో పాటు హిందీయేత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు తీవ్ర ఇబ్బందిగా మారింద‌న్నారు. కాంపిటిటీవ్ ఎగ్జామ్స్‌ను 12 భాష‌ల్లో నిర్వ‌హించాల‌ని జాతీయ నియామ‌క సంస్థ చెప్పింది. కానీ సీఆర్‌పీఎఫ్ నియామ‌క నోటిఫికేష‌న్‌లో ఆ విధానాన్ని అమ‌లు చేయ‌డం లేద‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

Also Read : Biryani for One Rupee: రూపాయికే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. మన దగ్గరే..!

Exit mobile version