హైటెక్స్ మూడు రోజుల పాటు జరగనున్న టై గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ సదస్సులో అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయన్, గ్రీన్‌కో గ్రూపు ఎండీ, సీఈవో అనిల్ కుమార్‌లతోపాటు 2,500 మంది డెలిగేట్స్, 550కి పైగా టై చార్టర్ సభ్యులు వీరితోపాటు 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నర ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేసిందన్నారు. ప్రయివేట్ రాకెట్ స్పెస్లోలోకి పంపిన స్టార్ట్ అప్ టీ హబ్ కి చెందినదేనని ఆయన వ్యాఖ్యానించారు. యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమన్నారు. తెలంగాణలో 50 సెక్టార్లలో 6500 స్టార్ట్ఆప్లున్నాయని ఆయన వెల్లడించారు.
యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమని, శాంతను….హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు. ఇప్పటికే….ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలన్నారు. స్టార్టుప్ లకు హైదరాబాద్ సొంతగడ్డగా మారిందన్నారు. అనంతరం అడోబి సిస్టమ్స్ సీఈఓ శాంతను నారాయన్ మాట్లాడుతూ.. నా సొంత గడ్డ హైదరాబాద్ కు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందని, ఇప్పుడు ఉన్నట్టుగా హైదరాబాద్ అప్పట్లో ఉండి ఉంటే నేను విదేశాలకు వెళ్లేవాడిని కాదన్నారు. కాబోయే వ్యవస్థాపకులందరికి నా నుంచి చిన్న సలహా….మీ కలలను విడిచిపెట్టకండని ఆయన అన్నారు.
