Site icon NTV Telugu

Minister KTR : మన్సుఖ్ మాండవీయ తెలంగాణ ప్రజలను బాధించారు

It Minister Ktr

It Minister Ktr

హైదరాబాద్‌కు బల్క్ డ్రగ్ పార్క్‌ను నిరాకరించడం ద్వారా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలంగాణ ప్రజలను బాధించారని తెలంగాణ మంత్రి కేఈఆర్‌ శనివారం ఆరోపించారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి చేసిన ప్రకటనపై కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందించారు. “భారతదేశం యొక్క ప్రముఖ లైఫ్-సైన్స్ హబ్‌కి బల్క్ డ్రగ్ పార్క్‌ను నిరాకరించడం ద్వారా, మీరు దేశానికి తీరని లోటు చేసారు” అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. “NPA ప్రభుత్వ రాజకీయ పరిగణనలు జాతీయ ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉండటం విచారకరం” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.
Also Read : Mallu Ravi: కాంగ్రెస్‌ సీనియర్లకు కౌంటర్‌.. కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చినవాళ్లు ఎంతమంది..?

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)ని నాన్-పెర్ఫార్మింగ్ అలయన్స్ (NPA)గా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు కేటీఆర్‌. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో కూడా బల్క్‌ డ్రగ్‌ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించారన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పేలా ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావును అభ్యర్థించారు.

Exit mobile version