తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికల వేళ ఆయా పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ అంటూ విమర్శలు గుప్పించారు. వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారని, మహా ఇంజనీర్లు వీళ్ళు బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎక్స్పానషన్ లెవల్ ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది వీళ్ళ అవగాహన అని ఆయన ఎద్దేవా చేశారు. జనాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ లోని ఈ చిల్లర గాళ్ళు అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Also Read : Samantha: పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా
రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనిశ్వరం కాంగ్రెస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ కి చరిత్ర తెల్వదని, తెలుసుకునే సోయి లేదన్నారు. మీ హయం లో మానకొండూరు లో సాగునీరు లేక ఎస్‌ఆర్ఎస్పీ కాలువల్లో క్రికెట్ ఆడుకునే వాళ్ళమని, స్క్రిప్ట్ అన్న మార్చుకో, లేదా స్క్రిప్ట్ రైటర్ నన్న మార్చుకో రాహుల్ అంటూ ఆయన సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం ధన యజ్ఞం చేసిందన్నారు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ గాడు రేవంత్ రెడ్డి అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Sajjala Ramakrishna Reddy: కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సజ్జల
