Site icon NTV Telugu

Minister KTR : చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో అందరికీ తెలుసు

Minister Ktr

Minister Ktr

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ రోడ్ షోలో కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన రాజగోపాల్ రెడ్డి బీజేపీకి కోవర్టుగా ఉండి తన ఎమ్మెల్యే స్థానాన్ని 1800 కోట్లకు తాకట్టు పెట్టిన ఘనుడు రాజగోపాల్ రెడ్డి అని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడి కోసం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేస్తున్నాడు ఇది కోవర్ట్ రాజకీయం కాదా అని ఆయన మండిపడ్డారు. చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. మూడున్నర ఏళ్లు శాసనసభ్యుడుగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి మీ సమస్యలను ఏనాడు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదని, అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలను తీర్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది కేసీఆర్ ది. అంగడిలో సరుకులను కొన్నట్లు ఓట్లను కొని గెలవాలని అనుకుంటున్నాడు రాజగోపాల్ రెడ్డి. తులం బంగారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు…. తీసుకోండి, ఓటు మాత్రం టీఆర్ఎస్ కే వేయండి.

Also Read : Tamilnadu: దీపావళి వేళ ఉగ్ర కుట్ర ప్లాన్?.. కారులో గ్యాస్‌ సిలిండర్లు పేలిన ఘటనపై అనుమానాలు
రాష్ట్రంలోని అత్యధిక వరి పండించే రాష్ట్రంగా నల్లగొండ ఉండడానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా.. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యను అంతం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది.. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జానారెడ్డిలు సాగునీటి శాఖ మంత్రులుగా పనిచేసినా… నల్గొండ జిల్లాకు, మునుగోడు నియోజకవర్గానికి, ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఏమీ చేయలేదు.. ఇంటింటికి నల్ల పెట్టి తాగునీటిని అందించి శాశ్వతంగా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి బాటలు వేసింది టీఆర్ఎస్.. మునుగోడు నియోజకవర్గ సాగు, తాగు నీటి సమస్య పరిష్కార కోసం ప్రాజెక్టులను డిజైన్ చేసింది కేసీఆర్.. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version