మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లు అధికారం ఇస్తే… ఏం పీకారని ప్రశ్నించారు. గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.
Also Read : Lal Salaam: మొయిద్దీన్ భాయ్ వస్తున్నాడు.. పక్కకు జరగండమ్మా
కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారని, అలాంటి కాంగ్రెస్ అధికారం ఇవ్వాలని అడుగుతుందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అంతేకాకుండా.. ప్రధాని మోడీపైనా..బీజేపీ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. మోదీ దేవుడు అంటూ బీజేపీ నేతలు పొగిడేస్తుంటారు. కానీ మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా? అని ప్రశ్నించారు. అదానీకి మాత్రమే ప్రధాని మోదీ దేవుడు కానీ ప్రజలకు కాదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు అన్నీ అదానీకి కట్టబెట్టి మోదీ ఆదానీకి మాత్రమే దేవుడు ప్రజలకు కాదన్నారు.
Also Read : Award winning Director: ‘సర్కిల్’ చుడుతున్న నీలకంఠ!