NTV Telugu Site icon

Minister KTR : సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడు.. మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడు

Ktr

Ktr

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడని, మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడన్నారు. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన పనులు మీ కళ్ళ ముందున్నాయని, ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అడగండని, కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయని, రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బందుకు జై భీమ్ అంటారన్నారు.

Also Read : Vijay Antony Daughter: నీ ఆలోచనలతో చచ్చిపోతున్నా.. నువ్వు లేకుండా ఉండలేను!

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ హయాంలో ఉన్న దారిద్ర్యం మళ్ళీ వస్తోంది. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నుకునేటివి కాదు.. మన కేసీఆర్ ను సీఎంగా ఎన్నుకునే ఎన్నికలు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఉన్నాడా? కేసీఆర్ తో పోటుపడేవారు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఎవరున్న ఉన్నారా? కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. కాంగ్రెసోళ్ళకు దిక్కు లేక డబ్బు సంచులతో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన సన్నాసిని పట్టుకొని పీసీసీ పదవి ఇచ్చారు. ఆ మొగోడు చెబితే మనం ఓట్లేయాలట. సోనియమ్మని బలి దేవత అన్నాడు. 1200 మందిని బలి తీసుకున్నవారు దేవత కాదు బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అన్నాడు. ఇప్పుడు ముద్దపప్పుకాదు.. సుద్ద పప్పు అంటున్నాడు.. ఆయన మాటలు నమ్ముదామా? నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ.. క్రిమినల్ అలాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడదామా?

Also Read : Israel Hamas War: పలు భూభాగాలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌.. 1,100కు చేరిన మృతుల సంఖ్య

మొన్న ఓటుకు నోటు ఈరోజు సీటుకో రేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి గా మారారు. ఆలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఆదానికో అంబానికి అమ్మేస్తాడు. కాంగ్రెస్ హామీలను చూసి మా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? రేపు మా పో పులి బయటికి వస్తుంది. కేసీఆర్ బయటికి వచ్చి ఏం చేయాలో ప్రజలకు చెబుతాడు. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసు. స్వయంగా ఆయనే చెబుతాడు. కేసీఆర్ క్రెడిబిలిటీ ఉన్న హిస్టరీ. ప్రజల మీద విశ్వాసం ఉన్న నాయకుడు… కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మద్దు. ఆగం కాకండి.. ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయండి. మోసాన్ని మోసాన్ని జయించాలి.. కాంగ్రెస్ వాళ్ళకు కర్నాటక నుంచి బిజేపి వాళ్ళకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఇస్తే తీసుకొండి..ప్రమాణం చేయిస్తే తుపాల్ తుపాల్ అని నీకే వేస్తామని చెప్పండి. కళ్ళ ముందు అభివృద్ధి ఉంది.. గుండెనిండా సంక్షేమం ఉంది. ఆరు దశాబ్దాలుగా మోసం చేసి చావగొట్టినోడు మళ్ళీ వచ్చి ఏదో చెబుతే నమ్మి మోసపోకండీ.’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.