NTV Telugu Site icon

KTR Fires on Centre: విద్యుత్‌ను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర..

Ktr Fires On Centre

Ktr Fires On Centre

KTR Fires on Centre: విద్యుత్ రంగాన్ని ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు అమలులోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడంతో ముందు డబ్బులు కడితేనే విద్యుత్తు లభిస్తుందన్నారు. ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ పంపిణీ రంగంలోకి దిగితే పెట్రోల్ రేట్ల మాదిరి రోజురోజుకి విద్యుత్ రేట్లు మారుతాయన్నారు. విద్యుత్ రేట్లు అడ్డగోలుగా భారీగా పెరుగుతాయని వివరించారు. నల్ల చట్టాల మాదిరే విద్యుత్ చట్టాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వచ్చే సీజన్ నుంచి ధాన్యం సేకరణలో ప్రైవేట్ కంపెనీలు వచ్చే ప్రమాదముందన్నారు. రాజన్న సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై మండిపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని విభేదాలను పక్కనపెట్టి ఏకోన్ముఖంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో అమ్మకాల పరంపర కార్యక్రమం కొనసాగుతోందని విమర్శించారు. ధాన్యం సేకరణ విధానాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి గింజను కొనే భాధ్యత కేంద్రానిదేనన్నారు. కేంద్రం దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి కొనుగోలు కేంద్రాలను సైతం ప్రైవేటు పరం చేస్తోందన్నారు. గతంలో మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతులతో ఆటలాడుకుందని విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన మోడీకి లేదన్నారు. ప్రపంచంలో అత్యధిక పేదలున్న దేశంగా ఇండియా నిలిచిందని ఆయన తెలిపారు.

తెలంగాణలో వ్యవసాయ కొత్త పుంతలు తొక్కుతుందన్న మంత్రి.. ఇక్కడి పథకాల గురించి కేంద్ర పీయూష్ గోయల్‌కు తెలియదని విమర్శించారు. కేంద్ర విద్యుత్ చట్టాన్ని తప్పుపట్టిన మంత్రి.. విద్యుత్‌ను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. స్వదేశీ బొగ్గు వనరులను దివాలా తీయించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మండిపడ్డారు. తన మిత్రుడు అదానీని శ్రీమంతుడిని చేసేందుకు మోడీ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. దళిత గిరిజనులకు విద్యుత్ రాయితీ ఎత్తివేసే ప్రమాదముందని ఆయన అన్నారు. విద్యుత్ సంస్కరణలతో రాయితీలను ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణలో ఊపిరి విద్యుత్ అని ఆయన అన్నారు. 26 లక్షల పంపుసెట్ల ఉచిత విద్యుత్‌కు ప్రమాదం వాటిల్లబోతోందని ఆయన ఆక్షేపించారు.

HCA President Azharuddin: టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి.. ఆన్‌లైన్‌లో అమ్మడానికి లేవు..

కేంద్ర విద్యుత్ సంస్కరణల చట్టం వస్తే తెలంగాణ రైతాంగానికి నేతన్నలకు చావుదెబ్బ తగలనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రీపెయిడ్ మీటర్లతో ముందే డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు.ప్రైవేటు పవర్ కంపెనీలు దిగితే పెట్రోల్ మాదిరిగానే అవుతుందన్నారు. ఉచితాలు రద్దు చేయాలన్న మోడీ.. కార్పొరేట్ వ్యక్తులకు వేల కోట్ల మాఫీ చేశారని విమర్శలు గుప్పించారు. ధాన్యం సేకరణ, విద్యుత్‌ను ప్రైవేటు పరం ద్వారా ముంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. విద్యుత్ మీటర్లు పెడితే కేంద్రం రుణాలు ఇస్తున్నామని అంటోందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం దానిని తిరిస్కరించిందని వెల్లడించారు. పోడుభూములపై సమావేశమైన మంత్రి.. జిల్లాలోని 66 గ్రామాల పరిధిలో భూములను గుర్తించాలని అక్టోబర్ 5లోగా అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.