ఖిల్లా వరంగల్ లో తూర్పు నియోజకవర్గ సంక్షేమ సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ.. ఒకే రోజు 15 వేల మందికి సంక్షేమ పథకాలు మంజూరు పత్రాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే సంక్షేమం.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసిఆర్ ను చూసి కాంగ్రెస్ బిజేపి నాయకులు వ్యవహరిస్తున్నారు.. ఎవరో వచ్చి ఏదేదో చేస్తామంటే ఆగం కాకండీ అని ఆయన చెప్పారు. తొందరలోనే శుభ వార్త వింటారు.. ఎవరెవరికి ఏం చేయాలో కేసీఆర్ ఆలోచిస్తున్నారు.. ఇప్పటి వరకు చేసింది కేసిఆరే.. మళ్ళీ వచ్చేది కేసీఆరే.. ఏం చేయాలన్నా కేసిఆరే చేస్తారు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: The Great Indian Suicide Review: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ రివ్యూ
ఎన్నికలు రాగానే పొలిటికల్ టూరిస్టులు వస్తారు అంటూ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఓట్లు కోసం ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మకండి.. మేము 9 ఏళ్ళలో ఏం చేశామో చెబుతూ ఓట్లు అడుగుతున్నాం.. వాళ్ళు ఏం చేశారని ఓట్లు అడుగుతారో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ళలో ఏది అడిగినా ఇచ్చింది కేసిఆరే.. ఆయనకు అండగా ఉంటామని చెప్పండి.. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మంత్రి కోరారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.. ఏం చేయాలన్నా కేసిఆరే చేస్తారు అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్-బీజేపీ నాయకులు చెప్పే మాటలు నమ్మితే మీరు ఆగమవుతారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Amit Shah: నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం.. వామపక్ష తీవ్రవాదంపై హోంమంత్రి సమీక్ష
సీఎం కేసిఆర్ అంటేనే సంక్షేమం.. పేదవాళ్ల కళ్ళలో సంతోషం చూడడమే బీఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కేటీఆర్ అన్నారు. కుల రహిత, వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్ష. సీఎం కేసీఆర్ ది.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నారు.. వాళ్లకు 55 ఏళ్లు అధికారం ఇచ్చారు.. గత ప్రభుత్వాలు కరెంటు, తాగు, సాగు నీరు ఇవ్వలేదు.. త్వరలోనే శుభవార్త వింటారు.. ఓట్ల కోసం గగిరెద్దుల్లా వస్తున్న వారిని నమ్ముదామా?.. మీకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడు ఎమ్మెల్యే నరేందర్ ను గెలిపించుకోండి.. ఎలక్షన్ రాగానే పొలిటికల్ టూరిస్టులు వస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.