NTV Telugu Site icon

Minister KTR : రాజ్‌భవన్‌ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి

Ktr

Ktr

రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయాలను మాట్లాడుతున్నారని మండిప్డారు మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాజ్ భవన్‌ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని హితవు పలికారు. రాజ్ భవన్ లో ప్రధాని ఫోటోలు పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ వాళ్లు పెట్టిందని, గవర్నర్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ని ఎవరు ఎన్నుకున్నారని రాజకీయలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ ఇవ్వవద్దని ముఖ్యమంత్రిగా మోడీనే చెప్పారని, బ్రిటిష్ కాలంలో ఉన్న రాజ్ పత్ ను కర్తవ్య పత్ గా మార్చారన్నారు. గవర్నర్ అనే పదవికి బ్రిటిష్ కాలంలో ఉండేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోదీ మొన్న గొప్ప స్పీచ్ ఇచ్చారని, బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాల‌ని మోదీ అన్నారని గుర్తు చేశారు. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందేనని, మ‌రి అవి ఎందుకు ఉండాల్నో.. అవి ఎందుకో.. దాని వ‌ల్ల దేశానికి ఏం ఉప‌యోగమో చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read : Bandi Sanjay : కేసీఆర్, ఆయన కుటుంబం నిజాం, రాజ కుటుంబం అనుకుంటోంది

ప్ర‌ధాన మంత్రి, ముఖ్య‌మంత్రినేమో ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు. గ‌వ‌ర్న‌ర్లు ఎవ‌రు ఎన్నుకున్న‌వారు..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. స‌ర్కారీయా క‌మిష‌న్, ఫూంచ్ క‌మిష‌న్ కూడా చెప్పింది. మేం చెప్పుడు కాదు.. మోదీ కూడా సీఎంగా ఉన్న‌ప్పుడు స్వ‌యంగా చెప్పారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని మోదీనే చెప్పారు. రెండేండ్ల పాటు రాజకీయాల‌కు దూరంగా ఉంటేనే ఇవ్వాల‌ని మోదీ చెప్పారు. మ‌రి ఇవాళ మోదీ అది పాటిస్తున్నాడా..? ముఖ్య‌మంత్రి మోదీనేమో నీతులు చెబుతాడు. ప్ర‌ధాన‌మంత్రి మోదీనేమో అదే నీతుల‌ను తుంగ‌లో తొక్కుతాడు. ఇవాళ వ్య‌వ‌స్థ అట్లున్న‌ది అని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read : RK Roja: మంత్రి ఆర్కే రోజాకు లక్కీ ఛాన్స్‌..! స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా నియామకం..