మునుగోడులో ప్రచారం జోరుమీదుంది. రోజు రోజుకు ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్నా కొద్దీ ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ మునుగోడు ప్రచారంలో మాట్లాడుతూ.. అభివృద్ధి మా మతం… జన హితమే మా అభిమతం అనుకుని ముందుకు సాగుతున్నామన్నారు. హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది… కేసీఆర్ నాయకత్వపటిమకు నిదర్శనమన్నారు. 24 గంటలు అన్ని రంగాలకు కరెంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా రూపుమాపారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 68 లక్షల టన్నుల వడ్లు పండితే …ఇప్పుడు మూడున్నర కోట్ల టన్నుల వరి పండుతుంది.
Also Read : Minister KTR Exclusive Live: మునుగోడు టీఆర్ఎస్ ను భయపెడుతోందా?
మోడీ సర్కారులో సరుకు లేదు. ముడి చమురు ధర పెరగలేదు.. కానీ మోడీ చమురు ధర పెరుగుతున్నది. కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద సెస్స్ వేసి 30 వేల కోట్లు వసూలు చేసింది. పెట్రోల్, డీజిల్ పై మేము ట్యాక్స్ లు పెంచలేదు… కానీ రాష్టాన్నీ పన్నులు తగ్గించాలని కేంద్రం కోరుతుంది. 65 ,70 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వాలని మా డిమాండ్. ప్రతి ఒక్కరికి మోడీ ఇస్తా అన్న 15 లక్షలు నల్గొండ లో ఒకరి అకౌంట్ లో వేసినట్టు ఉన్నడు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.