Site icon NTV Telugu

Minister KTR : రాష్ట్రాలకు ఆదర్శంగా బయో ఆసియా సదస్సు

Minister Ktr

Minister Ktr

హైదరాబాద్ వేదికగా జరిగే బయో ఆసియా సదస్సుపై మంత్రి కేటీఆర్‌ పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న సదస్సులో యాపిల్ కంపెనీ కూడా పాల్గొననుందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఈ రంగంలో ఉన్న 4 లక్షల ఉద్యోగాలను 8 లక్షలు చేస్తామని అన్నారు. కోర్టు కేసులు సైతం ఫార్మాసిటీకి అనుకూలంగా వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు 19 సదస్సులు జరిగాయని, ఈ సారి ప్రతిష్టాత్మకంగా 20వ సదస్సు నిర్వహించుకోబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Also Read : IPhone : హౌరా.. పాత ఐఫోన్‌కు 57 లక్షలా..? ఎందుకంత డిమాండ్‌..

ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు సదస్సు కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్ ‌: షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’ అన్న ఇతివృత్తంతో 20వ బయో ఏషియా సదస్సు జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత 19 సంవత్సరాల్లో 24వేలకోట్ల పెట్టుబడులను బయో ఏషియా రాష్ట్రానికి తీసుకువచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన పెట్టుబడులు కొన్ని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయన్నారు మంత్రి కేటీఆర్.

Also Read : Triple Talaq: విడాకులు ముస్లింలలోనే ఎందుకు నేరం.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏషియా విస్తృతమైన సేవలను అందించనున్నట్లు వివరించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యమని, 2021లో హైదరాబాద్‌ దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్‌ డాలర్లు ఉండగా.. 2028 నాటికి దీన్ని వంద బిలియన్‌ డాలర్లకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అదే సమయంలో ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న 4లక్షల ఉద్యోగాలను 8లక్షలకు పెంచుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Also Read : Seediri Appalaraju: సీఎం జగన్‌ను దూషిస్తున్నారు.. ఒక్కొక్కడికి తాటతీసే రోజు దగ్గరలోనే ఉంది..

Exit mobile version