Seediri Appalaraju: సీఎం వైఎస్ జగన్‌పై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. ఒక్కొక్కడికి తాట తీసే రోజు దగ్గరలోనే ఉంది అని హెచ్చరించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్రల పేరిట రకరకలా విన్యాసాలు చెస్తున్నారు అంటూ లోకేష్‌పై సెటైర్లు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదగకూడదన్నది చంద్రబాబు బలమైన అకాంక్షగా పేర్కొన్న ఆయన.. టీడీపీకి ఎమ్మెల్సీ , రాజ్యసభ అవకాశం వస్తే సూటికేస్ ఇచ్చేవారికి కేటాయించారు… బీసీలకు ఆదరణ తీసుకువచ్చామంటారు.. మీరు ఇచ్చిన ఆదరణ పథకంతో బాగుపడ్డ ఒక్క కుటుంబాన్ని చూపించండి అంటూ సవాల్ విసిరారు.. పదవులు అమ్ముకోవడం చంద్రబాబు నైజం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ స్థాయి ఏంటి? జగన్ స్థాయి ఏంటి? పిల్లబచ్చా లోకేష్ ది.. సీఎం జగన్ ను విమర్శించే స్థాయి కాదని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Volodymyr Zelenskyy: చైనా ఆ పని చేస్తే ‘వరల్డ్ వార్’ తప్పదు.. జెలెన్‌స్కీ హెచ్చరిక
సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తి గతంగా తిడుతూ దూషిస్తున్నారు.. కానీ, ఒక్కొక్కడికి తాటతీసే రోజు దగ్గరలో ఉందంటూ హెచ్చరించారు అప్పలరాజు.. మేం కన్నెర్ర చెస్తే గ్రామాలలో తిరగలేరు అని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, గన్నవరంలో ఇష్యూని రాజకీయంగా మైలేజ్ పొందేందుకు ప్రయత్నిస్తారు అని ఆరోపించారు.. టీడీపీ హద్దు మీరే ప్రయత్నం చేస్తుంది.. చంద్రబాబు మీ అల్లరి మూకలను అదుపుచేసుకోవాలని సూచించారు. ఎన్ని జిమ్మిక్కులు, కుట్రలు చేసినా.. గన్నవరం లాంటి ఘటనలు తీసుకొచ్చినా ఏమీ చేయలేరన్నారు.. నీ దరిద్రం ఇక రాష్ర్టానికి చాలు అని చంద్రబాబును ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు. ఇక, వైసీపీ 151 ఎమ్మెల్యేలు, 44 మంది ఎమ్మెల్సీ లు మంత్రి అర్హత కలిగినవారే.. మంత్రి వర్గకూర్పు అంశం సీఎం విచక్షణ అధికారమని స్పష్టం చేశారు.. కొన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనుకుంటే.. నేను మొదటిగా రిజైన్‌చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మా మత్స్యకారులకు మంచి గౌరవం ఇచ్చారు.. మత్స్యకారులకు జగన్‌మోహాన్ రెడ్డి ఇచ్చిన గౌరవం ఎవరు ఇవ్వలేదని.. నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇచ్చారు.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ అనే కంటే వైఎస్సాఆర్ బహుజన పార్టీ అనాలంటూ అభివర్ణించారు మంత్రి సీదిరి అప్పలరాజు.