NTV Telugu Site icon

Kottu Satyanarayana: ఏ వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు..? ఎన్నికల్లో పోటీకి టీడీపీకి అభ్యర్థులు లేరు

Kottu

Kottu

నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.. జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాన్ని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గున్ని తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటామా అని ప్రజలే అంటున్నారు.. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టాలని ఆశ ఉంది.. బీజేపీని ఓడించడానికి దేశంలోని నాయకుల అందరిని అనుసంధానం చేశాడు.. అది బెడీసీ కొట్టింది అని ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర చూసి ఎలాగూ బీహార్ లో ఉన్నానని ప్రశాంత్ కిషోర్ కూడా పాదయాత్ర చేశారు.. ఆ అనుభవం ఆయనకే తెలయాలి.. దగుల్ బాజీ రాజకీయాలు చేసిన చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ పై చేసిన కామెంట్స్ గుర్తు తెచ్చుకోవాలి అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Read Also: Ramana Gadi Rubabu: మార్కెట్ లో రమణగాడి రుబాబు చూస్తే మెంటల్ ఎక్కుతుంది

ప్రశాంత్ కిషోర్ ఎంత మందికి సలహాలు ఇచ్చాడు.. ఎన్ని చోట్ల ఓడిపోయింది అనేది సమాధానం చెప్తాడా అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ని ఎన్నో మాటలని బీహార్ పోటుగాడు వచ్చాడని ఇప్పుడు ఏమి అవసరం వచ్చి కాళ్లు పట్టుకొని తీసుకొచ్చారు.. వాళ్లే సమాధానం చెప్పాలి.. ఏ వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉంటారు..? మేము గేట్లు తెరిస్తే సగం సీట్లకు పోటీకి టీడీపీకి అభ్యర్థులు లేరు అని ఆయన విమర్శలు గుప్పించారు. జనసేన గురించి ఎంత చెప్పినా తక్కువే.. కాపు సామాజిక వర్గం తలదించేలా చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తించారు.. కోర్టు రిమాండ్ చేసి జైల్లో పెడితే సాష్టాంగ నమస్కారం చేసి జీవితాంతం చంద్రబాబుతో కలిసి రాజకీయం చేస్తా అన్నాడు.. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని సమర్థించలేదు.. కాపు నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఎప్పుడూ ఖండించలేదు.. చంద్రబాబు ద్వారా కాపులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపలేదు, కాపులకు నాయకత్వం వహిస్తున్నా అనే అర్హత కూడా పవన్ కు లేదు అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపణలు గుప్పించారు.