NTV Telugu Site icon

AP Govt: చెత్త నుంచి బయోగ్యాస్.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

Minister

Minister

AP Govt: ఏపీ చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్వాక్రా మహిళల ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయించే అంశంపై చర్చించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది. నైబర్ హుడ్ సర్వేపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సమీక్ష నిర్వహించారు. స్వయం ఉత్పత్తి వ్యాపార కేంద్రాలు నడిపించే స్థాయికి స్వయం సహయక బృందాలకు అండగా నిలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Read Also: Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధుల భేటీ

చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని ఆలోచన చేస్తున్నామని.. రాష్ట్రంలోని ఒక మండలంలో పైలెట్ ప్రాజెక్టు గా బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్టును ప్రారంభించి నిర్వహించటం ద్వారా ప్రాథమికంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించే విధంగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి చేపడతామని మంత్రి తెలిపారు. ఫ్లేటెడ్ ఫ్యాక్టరీస్‌ను ప్రతి జిల్లాలో ప్రారంభించి, స్వయం సహాయక సంఘాలకు అద్దె ప్రాతిపదికన ఇస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న107 ఉత్పత్తులను ఓఎన్డీసీ నెట్‌వర్క్‌ ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.