NTV Telugu Site icon

Konda Surekha: నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నియంత్రించాలి..

Konda Sureka

Konda Sureka

భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో.. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు.. గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి తెలిపారు.

Read Also: Khammam: ఖమ్మంలో తప్పిన ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన గ్రంథాలయ భవనం

ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. తన సెక్రటేరియట్ కార్యాలయంతో పాటు, నివాసంలోనూ వీలైనంతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నిర్ణయించామన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Read Also: Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..