NTV Telugu Site icon

Konda Surekha: గత పాలకుల విమర్శలు పట్టించుకోం.. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం

Konda Surekha

Konda Surekha

హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖా తెలిపారు. వరంగల్‌లో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖా మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. విపక్ష కార్పొరేటర్లకు కూడా నిధులు అందరితో సమానంగా కౌన్సిల్లో మాట్లాడడానికి సమయం కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలో అక్రమాలకు గురైనా ప్రభుత్వ స్థలాలను గుర్తించి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేశారని మంత్రి కొండా సురేఖా తెలిపారు. వరంగల్ నగరంలో అన్ని చెరువులపై అభివృద్ధి దిశగా తీర్మాణం చేశామన్నారు. మరోవైపు.. నయీంనగర్ నాల బ్రిడ్జితో ముంపు ప్రాంతవాసుల కష్టాలు తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి చెప్పారు. అలాగే.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తీర్మానం చేసుకున్నామని తెలిపారు.

Read Also: AP Excise Dept: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు

కాళోజీ కళా క్షేత్రంపై గత ప్రభుత్వం చిన్న చూపు చూసింది.. ముఖ్యమంత్రి రేవంత్ చొరవతో ప్రత్యేక ఫండ్స్ తీసుకొచ్చామని మంత్రి కొండా సురేఖా తెలిపారు. అంతేకాకుండా.. వర్షా కాలంలో ప్రబలుతున్న రోగాలపై ప్రత్యేక టీం ఏర్పాటు చేసాం.. విద్య, వైద్యం, అభివృద్ధి సంక్షేమాలపై రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ముందుకెళ్తున్నామని అన్నారు. గత పాలకుల విమర్శలు తాము పట్టించుకోమని.. తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని మంత్రి చెప్పారు. లక్షల కోట్లు మింగిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. తమకు అప్పుల కుప్పతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టిందని పేర్కొన్నారు. ఇదే కాకుండా.. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను సకాలంలో ఇస్తున్నాం.. ఎక్కడా తగ్గకుండా ప్రతిచోట సంక్షేమ పథకాలను జనాలకు అందిస్తున్నాం.. గత ప్రభుత్వంలో గుట్టలు గుట్టలుగా ఉన్న సీఎం హెల్త్ రిలీప్ ఫండ్ తమ ప్రభుత్వంలో క్లియర్ చేస్తున్నామని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకోవడం.. దాచుకోవడమే తప్ప ఏమీ చేయలేదని మంత్రి విమర్శించారు.

Read Also: DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..