NTV Telugu Site icon

Konda Surkha : మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ దంపతులు

Konda Surekha

Konda Surekha

ములుగు జిల్లాలోని మేడారం వనదేవతలను మంత్రి కొండా సురేఖ దంపతులు దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి కొండా సురేఖ.. సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన కోట్లాది భక్తులను ఇంతటి అడవి ప్రాంతంలో కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా సురక్షితంగా ఇండ్లకు భక్తులను పంపించే విధంగా వనదేవతలు కాపు కాస్తారని ఆమె కొనియాడారు. వనదేవతల ప్రత్యేకత దేశమంతా తెలుసని గతంలో మన ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె అన్నారు.

Actor Darshan Case: దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకి మగబిడ్డ..

మా కుల దైవమని, వన దేవతలను దర్శించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణను అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనోధైర్యాన్ని పెంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు తెలంగాణ ప్రజలను తల్లులు ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తో పాటు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, కూతురు సష్మిత పటేల్, అల్లుడు అభిలాష్, మనవడు శ్రీయాన్ష్ మురళీకృష్ణ వంటి కుటుంబ సభ్యులు ఉన్నారు.

Kejriwal: జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు