Minister Konda Surekha: తెలంగాణలో కులమత సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతతో పాటు యోగాసనాలు ఫాలో అవ్వాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్‌మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదరి, సోదరిమణులు పాల్గొన్నారు. తెలంగాణలో కులమత సాంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని కులమతాలకు రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోందన్నారు. బతుకమ్మ సంస్కృతిని వెస్టర్న్ కల్చర్‌తో భ్రష్టుపట్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ అల్లు అర్జున్ సినిమాలోని ఓ పాటను ఆలపించారు. “ఊ అంటావా మామా ఊఊ అంటావా” లాంటి పాటలను క్రిస్టియన్ పాటల్లో జోడిస్తున్నారని.. మతాలపైన విశ్వాసాలను కాపాడుకోవాలన్నారు. బతుకుమ్మ పండగను వెస్టర్నైట్ చేశారని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే బతుకమ్మ సాంప్రదాయాన్ని పాడుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరికి వారి మతంపై గౌరవ మర్యాదలు ఉండాలన్నారు. అది అవలంభించే బాధ్యత మనదేనని ఆమె సూచించారు. దయచేసి డీజే, సినిమా పాటలు సంస్కృతి, సంప్రదాయాలకు ఇక నుంచి వాడకుండా చూడాలన్నారు.
Read Also: Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
అంతకు ముందు.. వరంగల్ సిటీలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రజలకు మంత్రి కొండా సురేఖ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ దుస్తులు అందజేసి విందు ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం మంత్రి కొండా సురేఖ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ తెలిపారు. ప్రతిమతంలోనూ ఉన్న గ్రంథాలలో సారాంశం ఒకటేనని.. బైబిల్ గ్రంథం కూడా అందరూ ఒకరిపై ఒకరు గౌరవ మర్యాదలతో శాంతితో ఉండాలని బోధిస్తోందని తెలిపారు. క్రిస్మస్ పర్వదినం ప్రభు నిరాడంబరమైన పరిస్థితుల్లో జన్మించి ఒక గొప్ప సందేశం ఇచ్చారని చెప్పారు. ప్రతి ఒక్కరు కులమత బీద తారతమ్యాలు లేకుండా ఐకమత్యంతో మెలగాలన్నదే ప్రభువు సందేశమని వెల్లడించారు. ఏసుప్రభు జన్మదిన సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ ప్రభువును ప్రార్థిస్తున్నామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.