NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: కేటీఆర్ వాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి కోమటిరెడ్డి..

Komatireddy Venkatreddy

Komatireddy Venkatreddy

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘మేము కాంగ్రెస్ పార్టీ యోధులం.. తెలంగాణలో ఓటమి తర్వాత ఎలాగైతే తిరిగి పుంజుకొని విజయం సాధించామో.. అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం.. మీ స్వంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం, పార్టీ మీది. తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు అందించిన మీకు అభినందనలు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా కారకులైతే అది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ ఘనతనే’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Under 1Lakh Bike : లక్ష కంటే తక్కువ ధరలో లభించే బజాజ్ పల్సర్ లేదా హీరో ఎక్స్‌ట్రీమ్.. ఏది కొనడం బెస్ట్ ?

అంతకుముందు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీ్ట్ చేశారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు మిగిలిందని సెటైర్లు వేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయం చెందడంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం అని హరీష్ రావు చలోక్తులు విసిరారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని పేర్కొన్నారు.

Read Also: Nagachaitanya: నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య..?