NTV Telugu Site icon

Kollu Ravindra: విశాఖ ఉక్కును కాపాడింది సీఎం చంద్రబాబు!

Minister Kollu Ravindra

Minister Kollu Ravindra

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడింది సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి కొల్లు రవీంద్ర పేరొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ చాలా ఉపయోగం అని, కూటమి ప్రభుత్వ చిత్త శుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. వైసీపీ పాలన భూదోపిడీ కోసం జరిగిందని ఎద్దేవా చేశారు. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుఉంటుందని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతాయని, పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగు పెడుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.

Also Read: Gottipati Ravi Kumar: మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించం.. తప్పుడు ప్రచారం తగదు!

‘విశాఖ ఉక్కును కాపాడింది సీఎం చంద్రబాబు గారు. రాష్ట్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ చాలా ఉపయోగం. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. వైసీపీ పాలన భూదోపిడీ కోసం జరిగింది. 99 శాతం భోగాపురం ఎయిర్ పోర్ట్ ఎర్త్ పనులు పూర్తయ్యాయి. 37 శాతం రన్ వే పనులు జరిగాయి. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అనకాపల్లిలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ మీద ఆర్సిలర్ సంస్థ మిట్టల్తో సీఎం చంద్రబాబు దావోస్‌లో ఏంవోయూ చేసుకున్నారు. ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖలో దసపల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టే ప్రయత్నం చేశారు. విశాఖకు టీసీఎస్, గూగుల్ సంస్థలు వస్తున్నాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతాయి. పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని ప్రాజెక్టుల పరుగు పెడుతున్నాయి. ఏటా పది వేల క్యూసెక్కుల నీరు అందించే దిశగా పనులు జరుగుతున్నాయి’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.