NTV Telugu Site icon

Minister Kollu Ravindra: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కొల్లు రవీంద్ర

Ravindra

Ravindra

కనీవిని ఎరుగని రీతిలో బుడమేరుకు వచ్చిన వరద.. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలను అతలాకుతలం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 7రోజులుగా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల ఆక్రమణలు , మట్టి దోపిడీతో.. బలపరచాల్సిన బుడమేరు గట్లను బలహీనపరిచారని ఆరోపించారు. విపత్తుల వేళ ప్రజల వద్దకు వచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి.. రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. వరద ప్రభావంలో నష్టపోయిన అందరిని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితికి తేవడానికి 7రోజులుగా సీఎం విజయవాడలోనే ఉన్నారని తెలిపారు. కూటమి నేతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి…సేవలు అందించడం అభినందనీయమన్నారు.

READ MORE: UP News: మహిళా లాయర్‌పై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి అత్యాచారం..

మరోవైపు ఈ వరదలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. నందివాడ మండలంలో ప్రతి ఊరు ముంపు బారిన పడి నష్టపోయిందన్నారు. 6రోజులుగా ముంపులోనే ఇల్లు, పొలాలు ఉన్నట్లు తెలిపారు. 12వేల మందికిపైగా పునరావాస కేంద్రాలు.. సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఇంకెన్ని రోజులు ఈ వరద కష్టాలు ఉంటాయో అర్థం కావడం లేదన్నారు. మండలంలో వరద నష్టాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.