Kiren Rijiju: ఐదు రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు.. కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: ఐదురాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ మొదలైంది. షెడ్యూల్ వచ్చినప్పటినుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగానే.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజుని మిజోరాం రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమించింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు ఇతర నేతలకూ కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి యంతుంగో పాటన్లు మిజోరాం ఎన్నికలకు పార్టీ కో-ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తారని బీజేపీ తెలిపింది.
Read Also: Bathukamma: నేడే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ.. ఆడబిడ్డలకు సీఎం శుభాకాంక్షలు
Also Read
మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నవంబర్ 7న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు గెలిచింది. జెడ్పీఎం 8 స్థానాల్ని కైవసం కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ ఐదు, బీజేపీ ఒక సీటు మాత్రమే సొంతం చేసుకున్నాయి. ఈసారి మిజోరాంలోనూ సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ తనదైన వ్యూహాలు రచిస్తోంది. అటు.. జతీందర్ పాల్ మల్హోత్రాను పార్టీ ఛత్తీగఢ్ యూనిట్ ప్రెసిడెంట్గా నియమించింది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!