మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో మిర్చి యార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, రానున్న మూడు మాసాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసే విధంగా కార్యచరణ రూపొందించాం అని చెప్పారు. మిర్చి యార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా రైతులకు సేవలు అందిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ‘గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా రైతులకు సేవలు అందిస్తోంది. మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గత ఐదేళ్ల కాలంలో మిర్చి యార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. రానున్న మూడు మాసాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసే విధంగా కార్యచరణ రూపొందించాం. మిర్చి యార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. లైసెన్స్‌లకు సంబంధించిన అంశం మీద దృష్టి సారించాము. గత ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకుని లైసెన్స్‌లు ఇష్టం వచ్చినట్టుగా మంజూరు చేశారు. రవాణాకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తాం. మిర్చి యార్డులో మౌలిక సదుపాయాలు కచ్చితంగా కల్పించాలి. నగరం పెరిగిపోయింది, రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరో చోట విశాలమైన మిర్చి యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. అనువైన ప్రదేశం, స్థలం చూసి త్వరలో నూతన మిర్చి యార్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం’ అని చెప్పారు.