NTV Telugu Site icon

Karumuri Nageshwara Rao: పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తాం..

Karumuri Nageshwara Rao

Karumuri Nageshwara Rao

Karumuri Nageshwara Rao: అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పద్దతి లేకుండా, తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తిచేసి సీఎం జగన్ చేతుల మీదుగా తాగు, సాగు నీరందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.

Jogi Ramesh: జగన్ పేదవాళ్ల పక్షాన నిలబడతాడు.. పేదలను నిలబెడతాడు..

రైతులు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతులు పండించిన పంటలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన ఘనత చంద్రబాబుదని ఆయన విమర్శలు గుప్పించారు. బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.