NTV Telugu Site icon

Kandula Durgesh : గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే

Kandula Durgesh

Kandula Durgesh

రాజమహేంద్రవరం రూరల్ ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి ఘాట్స్‌ పరిశీలన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొ్న్నారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పుష్కర సన్నాహాలు ప్రారంభమయ్యాయని, గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. పరిమిత వనరులుతో గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా కార్యాచరణాలు ఉన్నాయన్నారు. గోదావరి ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చిదిద్దే ఆలోచన అని, ఈ రోజు ముఖ్యమైన రెండు ప్రాజెక్టలు మన ముందు వున్నాయన్నారు.

 

గోదావరి కాలుష్య నివారణ పధకం కింద డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరచాలని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. టెంపుల్ టూరిజం ద్వారా ప్రక్షాళన పేరుతో గోదావరి తీరంలో కొత్త ఘాట్స్ నిర్మాణాలు చేయాలని, పుష్కరాలను ఒక వేదికగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నారు దుర్గేష్‌. పెరుగుతున్న నగరాన్ని దృష్టిలోకి తీసుకుని ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లు, విస్తరణ, జరగాలని, నగరం అన్నిరకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాబోయే 2027 పుష్కరాలను ఆధారంగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం లో భాగంగా గోదావరి ఘట్స్ పరిశీలీస్తున్నట్లు ఆయన తెలిపారు.