ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై మంత్రులు మండిపడుతున్నారు. విజయవాడలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై మంత్రి కాకాణి. వైసీపీకి వ్యతిరేక ఓటు వేయటం పార్టీ అంతర్గత సమస్య అన్నారు. వ్యతిరేక ఓటు వేసిన వారిపై చర్యలుంటాయి. క్రాస్ ఓటింగ్ పై అంతర్గత సమావేశాల్లో విశ్లేషణ చేసి ముందుకు వెళ్తాం.
అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం 7 స్థానాల్లో పోటీ చేశాం. చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవే. 2024 చంద్రబాబు చివరి ఎన్నికలు. ప్రజల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినపుడు టీడీపీ విషయం బయటపడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఉండదు. కేవలం ప్రజలకు ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఈ ఫలితాలపై ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 2024లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ మళ్ళీ సీఎం అవుతారన్నారు.
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరిధర్ ఏమన్నారంటే..
ఆత్మ ప్రబోధానుసారం మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశాం. ఫలానా వాళ్లకు ఓటు వేయమని టిడిపి నుంచి కొంతమంది ఒత్తిడి చేశారు..నేను ఓటును అమ్ముకోను… నా మనస్సాక్షిగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానన్నారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరిధర్. వైసీపీని మోసం చేసిన ఎమ్మెల్యేల డేటా వైసిపి అధిష్టానం వద్ద ఉంది.
సరైన సమయంలో వాళ్ళపై చర్యలు ఉండొచ్చు…టిడిపి గతంలో ప్రలోభాలు పెట్టి 23 మంది వైసీపీ ఎమ్మెల్యే లని కొనుగోలు చేసింది… ఇప్పుడు అదే పంథా కొనసాగిస్తుంది… ప్రలోభాలు పెట్టి పక్క పార్టీల వాళ్ళని కొనడం కాదు, ఎమ్మెల్యేల మనసు గెలిచి ఓట్లు వేయించుకోగలగాలన్నారు. టిడిపి రెబల్ ఎమ్మెల్యే లు మాకు ఓటు వేస్తారు అని టిడిపి మైండ్ గేమ్ ఆడింది…ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను సీఎం జగన్ తో నే ప్రయాణం సాగిస్తానన్నారు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్.
Read Also:Minister Roja: 2024లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావు