NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: చుక్కల భూములపై సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు..

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: చుక్కల భూములకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి కాకాణ గోవర్ధన్ రెడ్డి అన్నారు. జీవో విడుదల చేయడంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని.. వీఆర్వో నుంచి ఫైల్ రావాలంటే ఆరు నెలలు పట్టేదని ఆయన విమర్శించారు. చాలా భూములకు సంబంధించి పరిష్కారం లభించలేదన్నారు. రైతుల సమస్యలు చూసి జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. చాలా చోట్ల రైతులు భూములను సాగు చేసుకుంటున్నారని.. వీరికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేయమని చెప్పారన్నారు.

చంద్రబాబు హయాంలో వీటిని నిషేధిత జాబితాలో పెట్టారన్న ఆయన.. రైతుల కష్టాలు చూసి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయంతో నెల్లూరు జిల్లాలోనే 40 వేల ఎకరాల మేర రైతులకు ప్రయోజనం కలగనుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే జిల్లాలో పర్యటించి రైతులకు పత్రాలు అందిస్తారని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: Ambati Rambabu: నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటా..

చుక్కల భూములు అంటే..
1924 -1946 మధ్య కాలంలో లోనో రెవిన్యూ వాళ్ల ఒక సర్వే చేశారట. ఆసర్వే జరుపుతున్నపుడు కొన్ని చోట్ల భూముల యజమాని అందుబాటులో లేడని యజమాని కాలమ్ నింపకుండా చుక్కలు పెట్టారు. ఇలాంటి చుక్కలు పెట్టిన భూములే చుక్కల భూములు. రెవిన్యూ వాళ్ల వాడుకలో ఇవి ’డాటెడ్ ల్యాండ్స్’. భూములు లేని రైతులు, పేదలకు ఈ భూములు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

Show comments