కృష్ణ పట్నం పోర్టు లో కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. ఈ విషయంపై రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వా లతో చర్చిస్తున్నామన్నారు. అఖిల పక్షం నేతలు ఎవరూ మాట్లాడటం లేదన్నారు. కానీ టీడీపీ నేత సోమిరెడ్డి మాత్రం నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. ఆయన నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో సెంబ్ కార్ప్ విషయంలో కూడా ఇదే తరహాలో ఉద్యమం చేసి, అఖిల పక్షాన్ని మోసం చేశారన్నారు. కంటైనర్ టెర్మినల్ కొనసాగుతుందని, ఇటీవల కాలంలో కంటైనర్ వ్యాపారం తగ్గిందన్నారు కాకాణి గోవర్థన్. టెర్మినల్ లో కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలని కేంద్ర మంత్రి కి కూడా లేఖ రాశామని, రాజకీయ ప్రయోజనాల కోసమే సోమిరెడ్డి నాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Breaking News: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపింది నేనే అని అప్పట్లో ప్రచారం చేసుకున్నారని, కృష్ణపట్నం పోర్టు లో కంటైనర్ టెర్మినల్ కొనసాగుతుందన్నారు మంత్రి కాకాణి. త్వరలోనే వెజల్ కూడా వస్తుందని, ఇది కూడా నా పోరాటం వల్లే వచ్చిందని సోమిరెడ్డి ప్రచారం చేసుకుంటారన్నారు. చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో ఓ ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని మంత్రి కాకాణి పేర్కొన్నారు. 24 గంటల్లో దీనికి స్పందించాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. తన పైన వచ్చిన ఆరోపణల పై సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని చెప్పిన అంశాన్ని కాకాణి గుర్తు చేసారు. ఇప్పుడు సీబీఐ క్లీన్ చిట్ ఇస్తే సీబీఐ సరిగ్గా విచారించలేదని చెబుతున్నారని మండిపడ్డారు.
Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!
