Site icon NTV Telugu

Chandrababu Arrest: ‘ఇంకా చాలా మంది బయటకు వస్తారు’

Kakani On Anam Issue

Kakani On Anam Issue

Minister kakani Govardhan Comments om Chandra Babu Naidu Arrest: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిపోయాయి. బాణాసంచా కాల్చి పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నాయి.

చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కాకాణి గోవర్థన్ స్పందించారు.  చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన అందుకే సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిందన్నారు . తాను ఎలాంటి తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారని, తప్పు చేసిన వారెవరూ నిజాన్ని ఒప్పుకోరని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ వద్ద నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అన్ని వెలుగులోకి వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ఈ కేసుల్లో బయటకు వస్తారని కాకాణి అన్నారు.

Also Read: Chandra Babu Arrest: ‘చంద్రబాబు చేసిన దాంట్లో ఇది చిన్న స్కామ్ మాత్రమే’

చంద్రబాబు అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండిస్తున్నట్లు చెప్పడాన్ని కాకాణి తప్పుబట్టారు. వారిద్దరికి  ఒప్పందం కుదిరినట్లుంది అందుకే  చంద్రబాబు అరెస్ట్ ను పురందేశ్వరి తప్పుబడుతున్నారని మంత్రి అన్నారు.  రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనం దుర్వినియోగమైన పర్వాలేదని మీరు చెప్పదలుచుకున్నారా అని పురందేశ్వరి నిలదీశారు.  రెండుసార్లు లోక్ సభ పోటీ చేసి పురందేశ్వరి  ఓడిపోయారని అందుకే  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో జతకట్టి పోటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.  అందుకే చంద్రబాబును తీసుకొని బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విషయంలో  ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పురందేశ్వరికి లేదని తేల్చి చెప్పారు కాకాణి గోవర్థన్.

 

 

Exit mobile version