NTV Telugu Site icon

Jyotiraditya Scindia: చిర్రగోనె ఆడిన కేంద్రమంత్రి.. వీడియో వైరల్

Jyothi

Jyothi

కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంప్రదాయ భారతీయ గేమ్ ‘చిర్రగోనె’ ఆడారు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాగా.. సింధియా చిర్రగోనె ఆడటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. ఆ ఆట ఆడుతున్న వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. చాలాసార్లు క్రికెట్ ఆడానని.. కానీ, ఈ ఆట ఆడటం చాలా సరదాగా ఉందని తెలిపారు.

Read Also: Congress: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో జరిగిన ఎంపీ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్ లో అక్కడి ఫొటోలను పంచుకున్నారు. అంతేకాకుండా.. ఇలా వ్రాశారు. ఈ రోజు అశోక్‌నగర్ పిల్లలు జాతీయ స్థాయిలో ఆడుతున్నారని తెలిపారు. అశోక్‌నగర్ పిల్లల సామర్థ్యాన్ని ఒలింపిక్స్‌లో చూడాలన్నది తన కల అన్నారు.

Read Also: AP Assembly: రేపు అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు

ఈరోజు అశోక్‌నగర్‌లో జరిగిన సంసద్ క్రీడా మహోత్సవ్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శన చాలా ఉత్తేజకరంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహిస్తుందని తెలిపారు. వారి నైపుణ్యాలను మెరుగుపర్చడంలో.. దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద పోటీలకు వారిని సిద్ధం చేయడంలో వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉందని హామీ ఇచ్చారు.