Free Cylinders: ఏడాదికి 2 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. గుజరాత్ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Cylinders: గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏడాదికి 2 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జితు వాఘాని సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో పౌరులు, గృహిణులకు రూ.1,000 కోట్ల ఉపశమనం లభిస్తుందని వాఘాని ప్రకటించారు. ఏడాదిలో రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. గుజరాత్‌లో 38 లక్షల మంది గృహిణులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం నిర్ణయించిన రూ.650 కోట్లతో గుజరాత్‌లోని ప్రతి ఇంటికి దాదాపు రూ.1,700 వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.
Complaints in WhatsApp: పోలీసుల అరుదైన రికార్డు.. ఎఫ్‌ఐఆర్ లేకుండానే 3 వేల కేసులు ఛేదించారు..!
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ)పై 10 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును కూడా మంత్రి సోమవారం ప్రకటించారు. సీఎన్‌జీలో 10 శాతం తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే కిలోకు రూ.6-7 వరకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా పీఎన్‌జీపై కిలోకు రూ.5-5.50 వరకు ప్రయోజనం ఉండబోతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన చాలా పెద్దదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా కూడా భావిస్తోందన్నారు. ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. పూర్తి మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!