కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ నేతలకు పదవులు.. బీఆర్ఎస్ కు ఓటేస్తే సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలు.. కులాలు, మతాల పేరు మీద దొంగలంతా ఏకమవుతున్నారు.. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాదేనని ఆయన వెల్లడించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.. పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేస్తారా.. మీ నరాలు కట్ అవుతాయి.. రేవంత్ వార్నింగ్
ఒక్కో గ్రామానికి అభివృద్ధి- సంక్షేమ కోసం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటు కష్టాలే.. కర్ణాటక పరిస్థితులే ఇక్కడా పునరావృతం అవుతాయి.. కాంగ్రెస్- బీజేపీ పాలిత కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో ఇచ్చే కరెంట్ 3 నుండి 6 గంటలేనని ఆయన ఆరోపించారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకుల చేతగాని తనం వల్లే వరుసగా ఏడు ఏళ్లు ఎడమ కాలువ ఎండిపోయిందన్నారు. ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో 10 ఎకరాలు కొనే రోజులు పోయి.. తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కళ్ళ ముందే మూసి నీరు లీక్ అవుతున్నా పట్టించుకోని పాపం గత పాలకులదే.. చెప్పిన మాట పైన నిలబడే నాయకుడు కేసీఆర్ అని ఆయన చెప్పుకొచ్చారు.