Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు జల వివాదం పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల హాక్కులు పరిష్కారం చూపనంత వరకు ఇలానే జరుగుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఏపీ పట్ల ఖండిస్తున్నామన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ లో మా హక్కులు హరించి మళ్లీ అదే పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవానికి తాగునీటి అవసరాలున్న మేము నీటిని వాడుకునే సమయంలో అడ్డుకోవడం సరైంది కాదన్నారు. నీటి వివాదాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఇది కచ్చితంగా రాజకీయ అజ్ఞానమే అన్నారు.