Site icon NTV Telugu

Jagadish Reddy : ఐటీ దాడులపై స్పందించిన మంత్రి జగదీష్‌ రెడ్డి..

Jagadish Reddy

Jagadish Reddy

ఇటీవల తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పీఏ ప్రభాకర్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ విషయంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నా పీఏ పై కాదు ఐటి దాడులు జరిగింది….నా అనుచరుడిపై అని వివరణ ఇచ్చారు. ఈటల రాజేందర్ ప్రభుత్వంపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని స్వయంగా ఈటల రాజేందర్ చెప్పారన్నారు. కౌరవుల పక్కన ఉండి- ధర్మయుద్ధం గురించి ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని, ఈటల రాజేందర్ ధర్మం, భాష గురించి మాట్లాడి సానుభూతి పొందాలంటే సాధ్యం కాదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఈటల రాజేందర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, హైదరాబాద్ నుంచి వచ్చిన గుండాలు పలివెల గ్రామంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : Petrol and Diesel Prices: ఎన్నికల ముందు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!

ఈటల రాజేందర్ కంటే ముందు నుంచే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ బిడ్డ జగదీశ్వర్ పై దాడి చేశారన్నారు. గోడవను ఆపేందుకు ప్రయత్నించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా దాడి చేశారని, పరివేలి గ్రామంలో బీజేపీకి మెజారిటీ రాదని స్పష్టంగా తెలిసిపోయిందని, హింసను కేసీఆర్ ఎప్పుడూ ఇష్టపడరని అందరికీ తెలుసునన్నారు. ప్రజలు లేకపోవడం వల్లనే బీజేపీ సభలను రద్దు చేసుకుందని, బీజేపీలో పెద్ద నాయకులే భయపడుతున్నారు…ఏ క్షణంలో మాయమైపోతానోనని! అంటూ ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్నంత స్వేచ్చాయుత వాతావరణం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్న మంత్రి జగదీష్‌.. నాపై నిషేధం పెట్టినా…సానుభూతి కోసం నేను ప్రయత్నం చేయలేదన్నారు. ఎవరు ఐటీ దాడులకు పురికొల్పుతోందో ప్రజలు గమనిస్తున్నారని, మా పోలీసులు ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుల ఇళ్లలో సోదాలు చేయలేదని, బైక్స్ పై ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలపై సడన్ గా బీజేపీ వాళ్ళు దాడి చేశారని, గతంలో బెంగాల్ లో ఇలానే దాడులు చేస్తే…ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version