NTV Telugu Site icon

Jagadish Reddy : రేపటి విజయం తెలంగాణ అభివృద్ధికి, దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు పునాది

Jagadish Reddy

Jagadish Reddy

రాష్ట్ర ప్రజలు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ నిన్న ప్రశాతంగా ముగిసింది. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తి స్వార్ధం, ఒక పార్టీ కుట్రతో ఉప ఎన్నిక వచ్చిందన్నారు. అంతేకాకుండా.. ప్రజల తీర్పు న్యాయం వైపేనని స్పష్టంగా తెలుస్తుందని, మూడు నెలలుగా కష్టపడి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలకు, సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఉప ఎన్నిక అని, రేపటి విజయం తెలంగాణ అభివృద్ధికి, దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు పునాది అన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

Also Read : Bandi Sanjay : ప్రగతి భవన్‌లో చూపిన సినిమా పేరు ‘‘నేనింతే – నా బతుకింతే’’

కేంద్ర ప్రభుత్వం చేయలేని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఆణచి వేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని, బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఐటీ, ఈడీ, అన్ని రాజ్యాంగ సంస్థలను ఉపయోగించినా, మునుగొడు ప్రజల స్ఫూర్తిని ఆపలేకపోయిందన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. మునుగోడులో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని, బీజేపీ ఎం మాట్లాడినా ప్రజలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలేదని మంత్రి జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌస్ వ్యవహారంలో దొరికిన దొంగల బండారం ప్రజల ముందు ఉంచాం దొరికిన దొంగలను తప్పించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని మంత్రి జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు. దొరికిన వారు నకిలీ ముఠా అయితే ఒరిజినల్ దొంగలు ఎవరో బండి చెప్పాలని, వేషాలు వేసి తాము తీసుకొస్తే అసలు దొంగలను మీరు బయటపెట్టాలన్నారు. తప్పించుకునే ప్రయత్నంలో డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్న బీజేపీ.. దొరికిన వారు ఒరిజినల్ కానప్పుడు నందకుమార్ భార్య కేసు ఎందుకు వేసిందో చెప్పాలన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.