NTV Telugu Site icon

Indrakaran Reddy: సింహావాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddy

Indrakaran Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపునా లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయానికి వచ్చారు. గోల్కొండ బోనాలతో మొదలైన బోనాలు సికింద్రాబాద్ లో ఇప్పుడు లాల్ దర్వాజ్ జరుపుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తున్నారు అని ఆయన తెలిపారు.

Read Also: Saroj Amber Kothare: ప్రముఖ ప్రొడ్యూసర్ సరోజ్ అంబర్ కొఠారే కన్నుమూత..

లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది.. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ హాట్రిక్ సాధించబోతోంది అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లాల్ దర్వాజ్ బోనాలకు తెలంగాణ సర్కార్ కు 9 కోట్ల రూపాయల నిధులు కేటాయించాము అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సింహావాహిని అమ్మవారి దేవాలయంకు పునురుద్దరణ కోసం ప్రభుత్వం నిధులు విడదల చేసింది అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాను.. రాష్టంలో వర్షాలు సమృద్ధిగా పడాలని అమ్మవారిని కోరుకున్నాను అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్

లాల్ దర్వాజ్ బోనాల పండగ సందర్భంగా సింహావాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకూండ తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే పాతబస్తీలో పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.