Indrakaran Reddy : అటవీశాఖ సిబ్బంది త్యాగం వెలకట్టలేనిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Indrakaran Reddy About Forest Martyrs
తెలంగాణలో అడవుల సంరక్షణకు చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్‌కుమార్ హరితహారం, అడవుల సంరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన అటవీశాఖాధికారులకు నివాళులు అర్పిస్తూ, అటవీశాఖ సిబ్బంది త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. 1984వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు ధైర్యం, అంకితభావంతో పని చేస్తూ అటవీ సంపదను కాపాడుతూ తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారని తెలిపారు.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
2021-2022 సంవత్సరంలో అటవీ అధికారులు మొత్తం 11,669 కేసులు నమోదు చేసి, అటవీ సంరక్షణలో భాగంగా రూ.14.07 కోట్ల జరిమానా విధించారని, రూ. 7.31 కోట్ల విలువైన కలప, 1,133 అటవీ భూముల ఆక్రమణపై కేసులు నమోదు చేయడమే కాకుండా 1,634 వాహనాలను జప్తు చేశారని తెలిపారు. అటవీ శాఖను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగులు, సిబ్బంది నియామకాలు చేపడుతోందని, ఈ ఏడాది 92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని మంత్రి తెలిపారు. దీంతోపాటు 2,173 వాహనాలను అటవీశాఖ అధికారులు, సిబ్బందికి అప్పగించారు.
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!