రైతుల తలరాతలు మార్చే ప్రాజెక్ట్ మల్లన్నసాగర్ : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని… అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
ఈ మేరకు ఎన్ని టీఏంసీల నీళ్లు వచ్చాయని, ఎన్ని మీటర్ల ఎత్తు వరకూ వచ్చాయో.. ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆరా తీశారు. 11 టీఏంసీల మేర నీళ్లు వచ్చాయని, 30 మీటర్ల ఎత్తు వరకూ పైకి నీళ్లు వచ్చాయని, బండ్ మొత్తం 22 కిలో మీటర్లు ఉండగా., దాదాపు 20 కిలో మీటర్ల మేర నీళ్లు చేరినట్లు ఇరిగేషన్ డీఈ సుమన్, జేఈ భరత్ లు మంత్రి హరీష్ రావుకు వివరించారు. ఈ విషయమై అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికీ నిలిచిపోయే గొప్పపనిని అనతి కాలంలోనే పూర్తి చేసుకున్నామని గత అనుభవాలను గుర్తు చేశారు.
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!