NTV Telugu Site icon

Minister Harish rao: కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి.. వైద్య సేవలపై ఆరా

Minister Harishrao

Minister Harishrao

Minister Harish rao: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీసారు. సేవలు బాగున్నాయని చెప్పడంతో మంత్రి హరీశ్‌ రావు సంతోషం వ్యక్తం చేశారు. కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 12 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా ఎనిమిది లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ అవసరం అని గుర్తించడం జరిగిందని మంత్రి తెలిపారు. కంటి వెలుగు ద్వారా 20 లక్షల మందికి కంటి సమస్యలు తొలగిపోయాయని ఆనందం వ్యక్తి చేశారు.

Read also: Revanth Reddy: కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావు

బాగా కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందికి అభినందించారు. ఇక 32 లక్షల మంది పురుషులు కాగా, 38 లక్షల మంది మహిళలు కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని స్ప‌ష్టం చేశారు. మహిళల నుండి ఎక్కువ ఆదరణ వస్తున్నద‌న్నారు. ఇక.. 4565 గ్రామ పంచాయతీల్లో, 1616 మునిస్పల్ వార్డుల్లో కంటి వెలుగు క్యాంపులు నిర్వహణ పూర్తి అయ్యింది. అంతేకాకుండా.. వంద రోజుల్లో అందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అయితే.. బాగా కృషి చేస్తున్న వైద్యారోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందికి హ‌రీశ్‌రావు అభినందనలతో ముంచెత్తారు. కాగా.. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అందరి కంటి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అందరూ కంటి వెలుగు సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నం చేయాల‌ని మంత్రి సూచించారు.
Naatu Naatu Song: మోదీ వ‌ల్లే అవార్డు వ‌చ్చింద‌ని చెప్పుకుంటారేమో.. కేటీఆర్ వీడియో వైరల్

Show comments