NTV Telugu Site icon

Harish Rao: సిద్ధిపేటలో హాఫ్ మారథాన్ రన్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Harish Rao

Harish Rao

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హాఫ్ మారథాన్ రన్ ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కాగా.. సిద్దిపేటలో నిర్వహించిన హాఫ్ మారథాన్ కి అపూర్వ స్పందన వచ్చింది. 21కే, 10కే, 5కే రన్ ల కోసం భారీగా రన్నర్లు, సైక్లిస్ట్ లు తరలివచ్చారు. అయితే, హైదరాబాద్ నుంచి 100 కిలో మీటర్లు రన్నింగ్ చేసుకుంటూ హాఫ్ మారథాన్ కి తాడూరి శ్రీకాంత్ అనే యువకుడు వచ్చాడు. అలాగే హైదరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ హాఫ్ మారథాన్ కి నేచర్ క్యూర్ ఆస్పత్రి డాక్టర్ నాగలక్ష్మి కూడా హాజరయ్యారు.

Read Also: Mehreen Pirzada: టైట్ ఫిట్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తున్న మెహ్రీన్..

ఈ సందర్భంగా హాఫ్ మారథాన్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికైనా సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహించడం సంతోషంగా ఉంది అని తెలిపారు. మూడు ఫార్మాట్లలో జరిగే ఈ రన్ కి దాదాపు 4 వేల మంది రన్నర్స్ వచ్చారు అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇకపై ప్రతి యేటా సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ హాఫ్ మారథాన్ బ్రాండ్ అంబాసిడర్లు హైదరాబాద్ నుంచి రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన తాడూరి శ్రీకాంత్, సైకిల్ పై వచ్చిన డాక్టర్ నాగలక్ష్మి అని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రన్సర్స్, సైక్లిస్ట్ లు పాల్గొనందుకు చాలా సంతోషంగా మంత్రి తెలిపారు.

Read Also: Poses As Nurse: సినిమాను మించిన స్టోరి.. స్నేహితుడి భార్యను చంపేందుకు నర్సువేషంలో..