Site icon NTV Telugu

Harish Rao: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి.. రైతు సంక్షేమం విషయంలో రాజీపడబోం..!

Harish Rao

Harish Rao

తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని సీఎం కేసీఆర్ మాఫీ చేసినందుకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా.. రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ సర్కార్ ఎక్కడా రాజీపడలేదన్నారు. ఒకే రోజు మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసినట్లు పేర్కొన్నాడు. అత్యధికంగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసిన రికార్డును తెలంగాణ ప్రభుత్వానికి నెలకొల్పిందన్నారు.

Read Also: Suriya: కుటుంబంతో విడిపోయి ముంబైలో మకాం.. సూర్య ఏమన్నాడంటే.. ?

దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, లైన్ లో నిలుచునే అవస్థ లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతోంది అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిరాటంకంగా కొనసాగించారు. ఇప్పుడు అదే రీతిగా రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనం అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా చెప్పారు.

Read Also: Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?

అయితే, సీఎం కేసీఆర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీలను మాఫీ చేసినందుకు తెలంగాణలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఉత్తర్వులతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండగకు ముందు రోజు శుభవార్త చెప్పడంతో సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.

Exit mobile version