NTV Telugu Site icon

Harish Rao : అక్కడ రజినీకి అర్థమైంది.. కానీ ఇక్కడి గజినీలకు ఎందుకు అర్ధమైతలే..

Harish Rao

Harish Rao

హైదరాబాద్ నగరం గురించి సూపర్ స్టార్ రజనీకాంగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్ లో ఉన్నాన్నా.. న్యూయార్క్ లో ఉన్నాన్నా.. అని ఇక్కడి అభివృద్ది గురించి ఆయన మాట్లాడారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది పక్క రాష్ట్రాల రజనీలకు అర్థమతుంది.. కానీ ఇక్కడి గజినీలకు అర్థం కావడం లేదని ప్రతిపక్షాలపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

Also Read : KKR vs GT: రప్ఫాడిస్తున్న గుర్బాజ్.. 10 ఓవర్లలో కేకేఆర్ స్కోరు ఇది!

సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్ లో బసవ భవన్ నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మనిషికి పని విలువ తెలిపిన మహనీయుడు బసవేశ్వరుడు అని పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడి జయంతి, వర్థంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. లింగాయత్ సమాజం ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Also Read : Adimulapu Suresh: ప్రతి కుటుంబానికి జగనన్న మేలు చేశారు

ఇక విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ది గురించి ప్రస్తావించారు. ఇటీవల హైదరాబాద్ కు షూటింగ్ కోసం జుబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లానని.. దాదాపు 20.22 ఏళ్లు తర్వాత అటు వెళితే.. ఇండియాలో ఉన్నాన్నా.. న్యూయార్క్ లో ఉన్నాన్నా అని అనిపించిందని ఆయన వ్యాఖ్యనించారు. హైదరాబాద్ ఆర్థికంగా ఎంత బలంగా ఉండో అందరికి తెలిసిందేనని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆఱ్ కూడా ఇదే విషయం తనతో చెప్పారని రజనీకాంత్ అన్నారు.