Site icon NTV Telugu

Harish Rao : నిజమైన పర్యావరణ వేత్త కేసీఆర్

Harish Rao Cm Kcr

Harish Rao Cm Kcr

నిజమైన పర్యావరణ వేత్త కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ వేదిక మంత్రి హరీష్ రావు ..మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనం కలిగి ఉన్న అరుదైన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. దూరదృష్టితో ప్రారంభించిన హరితహారం ద్వారా సీఎం కేసీఆర్‌ పచ్చదనంలో 7.7 శాతం వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. 14,864 నర్సరీలు, 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని హరీష్‌ రావు వెల్లడించారు. 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పెంచామని, కొత్తగా 273 కోట్ల మొక్కలను నాటామని ఆయన అన్నారు. నిజమైన పర్యావరణ వేత్త సీఎం కేసీఆర్‌ అని, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Also Read : Salaar: ఇన్ని రోజులు రాముడి రాక కోసం ఆగారు… ఇక రాక్షసుడి ఆగమనం

అయితే.. అటవీ శాతాన్ని పెంచాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో రాష్ట్రంలో పచ్చదనం అలుముకుంది. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కును 2,087 ఎకరాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఏర్పాటు చేశారు. 2021లో రెండుకోట్ల సీడ్‌బాల్స్‌ వెదజల్లి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డును సాధించారు. గ్రామాలు, మండలాలు, బల్దియాల్లోని నర్సరీల ద్వారా ఏటా వానకాలంలో వేలాది మొక్కలు నాటుతున్నారు. రహదారుల వెంట గ్రీనరీ పరుచుకోవడంతో ప్రయాణికులకు ఆహ్లాదకర అనుభూతి కలుగుతున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హరితోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకుగానూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read : Honour killing: ప్రేమిస్తోందని కూతురుని చంపేసిన తండ్రి.. లవర్‌ని కూడా వదిలిపెట్టలేదు..

Exit mobile version