Site icon NTV Telugu

Minister Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్థరాత్రి కరెంటు వచ్చేది

Harish Rao

Harish Rao

Minister harish rao inaugurated double bed rooms

త్వరలోనే ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు. శనివారం.. నంగునూరు మండలంలోని పాలమాకుల గ్రామంలో నిర్మించిన 23 డబుల్ బెడ్ రూమ్ లను మంత్రి మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఉచితాలు వద్దని చెప్పి 10 లక్షల కోట్ల రూపాయలను పారిశ్రామిక వేత్తలకు రుణాలు మాఫీ చేసిందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ఉచితాలపై ఎద్దేవా చేయడం సరికాదని హితవు పలికారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దొంగ రాత్రి కరెంటు వచ్చేది ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదాయం పెంచింది సీఎం కేసీఆర్ అయితే ప్రజల సొమ్మును ధనవంతులకు పంచింది బీజేపీ అని మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. దేశం చూపు ఇప్పుడు తెలంగాణ వైపు ఉందని.. దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతంగా.. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు.

 

Exit mobile version