Site icon NTV Telugu

Harish Rao : బీజేపీ నేతలది నోరా? మొరా? దమ్ముంటే బీజేపీ పాలిత రాష్టాల్లో 3వేలు పింఛన్ ఇచ్చి చూపండి

Harish Rao

Harish Rao

తెలంగాణలో ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఇచ్చిన హామీలపై వీడియోలను ప్రదర్శించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ప్రజల్ని మోసం చేసేందుకు పగటి కలలు కంటున్నారు. రావి నారాయణరెడ్డి లాంటి పోరాట యోధులు జన్మించిన పోరాటాల గడ్డపై ఉన్న ప్రజల్ని మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వమే.. నల్ల చట్టాలపై దేశం మొత్తం తిరగబడింది. బీజేపీ నాయకులు నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో బీజేపీ 3వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు. మునుగోడులో ఇదే హామీ ఇస్తున్నారు. కేసీఆర్ రెండో సారి గెలిస్తే రెండు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. బీజేపీ నేతలది నోరా? మొరా? దమ్ముంటే బీజేపీ పాలిత రాష్టాల్లో 3వేలు పింఛన్ ఇచ్చి చూపండి.

 

ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలోనే 750 రూపాయలు, కర్ణాటకలో 600 రూపాయల పింఛన్లు ఇస్తున్నారు. జుమ్లా, ఝూట మాటలు బీజేపీ నేతలవి. ఎన్నికల ముందు ఎన్నో ఫాల్స్ హామీలు ఇస్తాం అవన్నీ నమ్ముతారా అని ఓ ప్రెస్ మీట్ లో స్వయంగా అమిత్ షా చెప్పారు. ఒక ఓటు రెండు రాష్టాల హామీ నుంచి జూట, జుమ్లా కొనసాగుతూ వస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా అన్ని అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మునుగోడులో కూడా అసత్య, అబద్ధాలు చెబుతున్నారు. బీజేపీ నాయకుల నోటికి మొక్కాలి.’ అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

Exit mobile version